డాక్టర్ మల్లిన వెంకట్రావు
జననము : 11జనవరి,1938
ధర్మపత్ని : శ్రీమతి రామసీత
తల్లి దండ్రులు: శ్రీ మల్లిన సత్యనారాయణ
శ్రీమతి మల్లిన చంద్రమ్మ
రచనలు:
శ్రీమద్భగవద్గీత - తత్వవివేచన
రచన - ప్రచురణ : డాక్టర్ మల్లిన వెంకట్రావు, పిహెచ్.డిశ్రీ సత్యసాయి సదనము
19-15-4, రామచంద్రపురం
తూర్పు గోదావరి - 533255
ఫోన్ : (08857) 242007
సమర్పణ
శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరుని దివ్య సంకల్పము, పూజ్య గురుదేవులు డా. ఇలపావులూరి పాండురంగారావుగారి ఆశీర్వాద ప్రోత్సాహములు, పూర్వజన్మ సంస్కారము - వీటి అన్నింటి కారణముగ ప్రస్థానత్రయము అనబడు శ్రీమద్భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూఏత్రములు - ఈ మూడింటి అధ్యయనము చేసి వీటి తాత్పర్య వ్యాఖ్యలు వ్రాసుకొనగలిగితిన. ఈ అధ్యయనమునకు గీతా ప్రెస్, గోరఖపూర్ వారి ప్రచురణలు ఉపకరించినవి.
శ్రీమద్భగవద్గీత యందలి శ్లోకముల తాత్పర్య వ్వ్యాఖ్యలు 418 పేజీలలో వ్రాకొనిన తదుపరి శ్రీమద్భగవద్గీత తత్వవివేచనను సంక్షిప్తముగా వ్రాసుకొనవలయునను సంకల్పముతో ఉపనిషత్తుల, బ్రహ్మసూత్రముల సహాయముతో ప్రయత్నించుట జరిగింది.
జ్ఞాన సముపార్జనకు, సమయ సద్వినియోగమునకు చేసిన ఈ సాధన శ్రీసాయీశ్వరుని సంకల్పము. ఈ సాధనా ఫలము శ్రీ సత్యసాయీశ్వరునకు సమర్పితము.
బుధజన విధేయుడు
మల్లిన వెంకట్రావు
23-11-2010
శ్రీ సత్యసాయీశ్వరుని 85వ జన్మదినోత్సవ వేడుకలు.
మనవి
భక్తి, జ్ఞానము, కర్మ, యోగము (ధ్యానము) అను వివిధ మార్గములను అనుసరించు వారు ఆధ్యాత్మ్య క్షేత్రమున కలరు. వీరిలో కొందరు తమ మార్గమే శ్రేయస్కరమని భావించుచు అన్య మార్గములు సరియైనవి కావని వాదింతురు. శ్రీకృష్ణపరమాత్మ ఈ వివాదములను తొలగించుటకై గీతోపదేశమున సర్వమార్గముల సమన్వయము చేసెను. మోక్షము పొందుటకు భక్తి, జ్ఞానము, కర్మ, యోగము (ధ్యానము) అను నాలుగు మార్గములు కలవనియు, ఏ మార్గమున ప్రయాణము చేసినను మోక్షము పొందవచ్చుననియు తెలిపెను. తమ తమ సంస్కారములు, యోగ్యతలు మరియు పరిస్థితులను అనుసరించి తగు మార్గమున ప్రయత్నించ వచ్చునని తెలిపెను.
కొందరు కర్మాచరణయందు ఆసక్తి, యోగ్యత కలిగి యుందురు. అట్టివారు కర్మతత్వమును, నిష్కామకర్మ మహాత్మ్యమును అవగతము చేసుకొని భగవదర్పితముగా కర్మలను ఆచరించుఇ మోక్షమును పొందవచ్చును. వారి నిమిత్తమై “కర్మయోగము” అను అధ్యాయము గీతయందు ప్రత్యేకముగా కలదు.
మరికొందరు భక్తిమార్గమును అనుసరించెదరు. వారి నిమిత్తమై “భక్తియోగము” అను ఒక అధ్యాయము గీత యందు కలదు. మరికొందరు ఆత్మానత్మ వివేచన యందు శ్రద్ధ కలిగి యుందురు. వీరి నిమిత్తమై “జ్ఞానయోగము” జ్ఞానవిజ్ఞానయోగము” క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగ యోగము” అను అధ్యాయములు కలవు.
మరికొందరు ధ్యానము నందు మక్కువ కలిగియుందురు. వీరికి బాహ్యవ్యవహారములయందు ఆసక్తి యుండదు. సదా అంతర్ముఘులుగా ఉండగోరెదరు. వీరి కొరకు “ధ్యానయోగము” (ఆత్మ సంయమ యోగము) అను అధ్యాయము కలదు.
ఈ విధముగా భిన్న భిన్న మనస్తత్వములు కలవారి నందరిని గీత సంతృప్తి పరచి, అన్ని మార్గములు సరియైనవే అని నిరూపించుచున్నది. సర్వయోగ సమన్వయము, భక్తి, జ్ఞాన, వైరాగ్య మిశ్రిత నిష్కామకర్మ - గీత యొక్క ప్రముఖ లక్షణములు.
పై విధముగా భక్తి, జ్ఞాన, కర్మ, ధ్యానముల నిమిత్తమై వేర్వేరు అధ్యాయములు ఉన్నప్పటికీ ఆయా విషయములు ఆయా అధ్యాయముల యందు మాత్రమే వివరింపబడలేదు. పై విషయములు కొద్దిగానో, ఎక్కువగానో అన్ని అధ్యాయములయందు కలవు. 18వ అధ్యాయము అయినచో గీతా సందేశము యొక్క సంగ్రహ స్వరూపమే.
భక్తి యొక్క వివేచన12వ అధ్యాయమున ప్రత్యేకించి యున్నను, 2వ అధ్యాయమున 61వ శ్లోకమునందును, అనగా 2-61వ శ్లోకమునందును, 3-30, 4-41, 5-29, 6-47, 7-14, 8-14, 9-34, 10-9, 11-54, 13-10, 14-26, 15-19, 16-1, 17-27, 18-66 శ్లొకములయందును, మరియు వివిధ అధ్యాయములయందును కలదు.
అటులనే జ్ఞాన, కర్మ, యోగ మార్గముల వివేచన కూడ వివిధ అధ్యాయములయందు కలదు.
వివిధ అధ్యాయములయందు, వివిధ శ్లోకములయందు గోచరించు భక్తి, జ్ఞాన, కర్మ, యోగమార్గముల వివేచన ఒకచోట చేర్చిగీతాతత్వమును అవగతము చేసుకొనుటకు ప్రయత్నము జరిగింది. ఈప్రయత్నము సమగ్రము కాదు. స్వీయ జిజ్ఞాస కారణముగా నా బుద్ధికి తగినట్లుగా ప్రయత్నించితిని. జనన మరణములు, జీవాత్మనిత్యత్వము, జీవాత్మ పరలోకగమనము, జీవాత్మ మరల శరీరమున ప్రవేశించుట - ఈ విషయముల వివేచనకు ఉపనిషత్తుల, బ్రహ్మసూత్రముల అధ్యయనము సహకరించినది. నా యొక్క ఈ సాధన సఫలీకృతము అగుట భగవత్ సంకల్పము పై ఆధారపడియున్నది.
జై శ్రీసాయిరాం
బుధజన విధేయుడు
మల్లిన వెంకట్రావు
23-11-2010
రచయిత తండ్రి గారు
శ్రీ మల్లిన సత్యనారాయణ గారు
(ప్రెసిడెంట్ సత్యం గారు)
శ్రీమద్భగవద్గీత - తత్వవివేచన
విషయ సూచిక
మనవి
శ్రీమద్భగవద్గీత మహాత్మ్యము
శ్శ్రీమద్భగవద్గీత - ధ్యాన శ్లోకములు
శ్రీమద్భగవద్గీత జయంతి
శ్రీమద్భగవద్గీత - సందేశ శ్లోకము
1. ప్రధమ అధ్యాయము: భక్తియోగము
చతుర్విధ భక్తులు
అన్యదేవతారాధన
నిర్గుణోపాసన
నిరాకార బ్రహ్మ సాకారుడగుట
పరమాత్ముని సర్వవ్యాపకత్వము
పరమాత్ముని విభూతి
భక్తి యోగము
అంత్యకాలస్మరణ ప్రాముఖ్యత
పరమాత్ముని దివ్య ధామము
2. ద్వితీయ అధ్యాయము : జ్ఞాన యోగము
జ్ఞాన మహిమ
స్థితప్రజ్ఞుడు
దైవాసుర స్వభావములు
త్రివిధ బుద్ధులు
త్రివిధ ధృతులు
త్రివిధ శ్రద్ధలు
త్రివిధ ఆహారములు
త్రివిధ సుఖములు
జ్ఞానయజ్ఞ మహిమ
3. తృతీయ అధ్యాయము : కర్మ యోగము
నిష్కామకర్మ యోగము
ఇంద్రియముల అద్భుతశక్తి
త్రిగుణముల శక్తి
ప్రకృతి యొక్క మహిమ
త్యాగం - సన్న్యాసం
నిష్కామ కర్మయోగుల కర్మయోగం
ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు
భక్తి,జ్ఞాన, కర్మల సమన్వయం
4. చతుర్ధ అధ్యాయము : ధ్యాన యోగము
యోగి లక్షణములు
ధ్యానయోగ విధానము
యోగ భ్రష్టుడు
శుక్ల, కృష్ణ గతులు
బ్రహ్మజ్ఞాని పొందు బ్రహ్మలోకము
5. పంచమ అధ్యాయము : జీవాత్మ నిత్యత్మము
మరణము
జీవాత్మ మరల నూతన శరీరమును ధరించుట
ఆత్మ, జీవాత్మల నిత్యత్వము
సంసార వృక్ష వర్ణన
6. షష్ఠమ అధ్యాయము:
పరమాత్ముని లక్షణములు
పరమాత్మ తన మహిమను తెలియజేయుట
7. సప్తమ అధ్యాయము : బ్రహ్మీస్థితి- వివేచన
బ్రహ్మీస్థితి పొందుటకు కావలసిన లక్షణములు
బ్రహ్మీస్థితి పొందినవారి లక్షణములు
ఉపనిషత్ జ్ఞాన వివేచన
రచన - ప్రచురణ
డాక్టర్ మల్లిన వెంకట్రావు, పిహెచ్.డి
19-15-4, శ్రీ సత్యసాయి సదనము
రామచంద్రపురం
తూర్పు గోదావరి జిల్లా - 533255
ఫోన్ : (08857) 242007
సమర్పణ
సర్వదేవతాతీత స్వరూపులయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి సంకల్పము, ఆశీర్వాదములు మరియు పూజ్యగురుదేవులు డా. ఇలపావులూరి పాండురంగారావుగారి ఆశీర్వాద ప్రోత్సాహములు - వీటివలన ఆధ్యాత్మిక గ్రంధముల అధ్యయనము పట్ల ఆసక్తి కలిగింది.
చదివినదానిని మననము చేసుకొనుటకు మరియు సమయ సద్వినియోగమునకు వ్రాసికొనుటయు జరిగింది.
జిజ్ఞాసువులకు ఉపకరించును అను ఉద్దేశముతో ప్రచురించుట జరిగింది.
జ్ఞాన సముపార్జనకు, సమయ సద్వినియోగమునకు చేసిన ఈ సాధన శ్రీసాయీశ్వరుని సంకల్పము.
నాదిఅనునది ఏమీలేదు అని భావించుచు, ఈ సాధనాఫలమును శ్రీసత్యసాయీశ్వరునకు సమర్పించుచున్నాను.
బుధజన విధేయుడు
మల్లిన వెంకట్రావు
రామచంద్రపురం
23-11-2011
ఆధ్యాత్మిక గ్రంధముల అధ్యయనమునకు,
రచనా వ్యాసంగమునకు స్ఫూర్తిని,ఆశీర్వాదమును ఒసంగిన
సర్వదేవతాతీతస్వరూప భగవాన్ శ్రీ శ్రీ శ్రీ శ్రీసత్యసాయిబాబా వారు.






























































































